తొందర్లో టిఆర్ఎస్ ఖాళీ మాజీ ఎంపీ పొంగులేటి ఖమ్మం తీర్పు ప్రతినిధి

తొందర్లో టిఆర్ఎస్ ఖాళీ
మాజీ ఎంపీ పొంగులేటి
ఖమ్మం తీర్పు ప్రతినిధి

  1. . త్వరలో వందలాది మంది బీఆర్ఎస్ సర్పంచ్ లు, కార్పొరేటర్లు, నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలేరు నాయకులు రాయల నాగేశ్వర రావు నివాసానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ 6 గారెంటీ కార్డ్ లను ప్రవేశ పెడితే వాటిని ఎలా ఇస్తారు వాటికి నిధులు ఎక్కడినుండి తీసుకుని వస్తారు అని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు వారి మేనిఫెస్టోలో ఏముందో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు తిని తినక కోచింగ్ సెంటర్ లకు డబ్బు కడితే స్కాంల పేరుతో వారి సమయాన్ని, డబ్బును బురదలో పోసిన పన్నీరు చేశారన్నారు. కురుక్షేత్రం అతి కొద్ది రోజుల్లో జరుగుతుందని, ఆ కురుక్షేత్రంలో విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీనే అని జోస్యం చెప్పారు. కష్ట సమయంలో పాలేరులో కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉండి, ఓడి పోతాడని తెలిసి కూడా రాయల నాగేశ్వరరావు ఎమ్మెల్సీగా పోటీ చేశారని అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులతో కూర్చొని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చేలా అందరూ కలిసి పని చేస్తామని రాయల నాగేశ్వరరావు అన్నారు.

Share this post

submit to reddit
scroll to top