ఎన్ని నాటకాలు ఆడినా బీసీలను టీడీపీ నుంచి వేరు చేయటం జగన్ తరం కాదంటూ టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. పదవులు ఇచ్చి బీసీల నోటికి ప్లాస్టరు వేస్తున్నారన్నారు. రాష్ట్రం మొత్తాన్ని నలుగురు రెడ్లకు రాసిచ్చారంటూ ఆరోపించారు. టీడీపీ నుంచి వచ్చిన ఇద్దరికి, జగన్ దొంగ లెక్కలు రాసే ఒకరికి, సీబీఐ కేసులు వాదించే ఇంకొకరికి రాజ్యసభ సీట్లిచారన్నారు. బీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటే బీసీలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ బంధాన్ని జగన్ తల్లకిందులుగా తపస్సు చేసినా విడదీయలేరన్నారు. ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

చదవండి : రాష్ట్ర భవిష్యత్తుకు టీ.డీ.పీ నే అవసరం – చంద్రబాబు..!!
గడప గడపకు వైసీపీ అని పెడితే ప్రజలు వెంటపడతారని.. గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టారన్నారు. బాదుడే బాడుడుతో టీడీపీ ప్రజల వద్దకు వెళుతోందని.. పోటీగా వైసీపీ కార్యక్రమాలు చేస్తోందన్నారు. తాడికొండలో ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించిన వెంకాయమ్మ అనే మహిళపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 160 స్థానాల్లో గెలిచి టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారన్నారు. వైసీపీ ఓ గాలి పార్టీ అని.. గాలికొచ్చిన పార్టీ గాలికే పోతుందన్నారు. వైసీపీకి అసలు రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హతే లేదన్నారు.
ఇవి’కూడా చదవండి