ఏపీలో కరెంట్ కష్టాలు గట్టెక్కాయి. అన్ని రకాలుగా కోతలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కానుంది. మరోవైపు పరిశ్రమలకు విద్యుత్ కోతల వేళలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరణ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత వలన కొద్దిరోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ పంపిణీ లో సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడటంతో అన్ని రంగాల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. కొద్ది రోజుల నుంచి పరిశ్రలమకు పవర్ హాలిడే ప్రకటించి అమలు చేసారు. దీని పైన పెద్ద ఎత్తున రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యుత్ కోతలు అమలు చేయటం పైన విమర్శలు వచ్చాయి. అయితే, ఇంకా వేసవి కొనసాగుతున్న సమయంలో కోతల నుంచి రిలీఫ్ దక్కటం ఉపశమనం ఇస్తోంది.
చదవండి : జగన్ దృష్టిలో నేను ఉన్నాను – ఆలీ..!!