వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని ఇక వారిని ఎవరూ ఆపలేరని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ప్రజలపై సీఎం జగన్ సైకోలను వదిలారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ సైకోలనూ వదలం.. వడ్డీతో సహా తీర్చుకుంటామని హెచ్చరించారు. సొంత నియోజకవర్గానికి తాగునీరు ఇవ్వలేని సీఎం రాష్ట్రాభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నందునే అప్పులు పుట్టలేదని తెలిపారు. జగన్ శాడిజం, అరాచకం, విధ్వంసాన్ని ప్రజలు చూస్తున్నారని హెచ్చరించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే ఆలోచించి ఉంటే.. జగన్ ఇడుపులపాయ దాటి బయటికి వచ్చేవాడు కాదన్నారు. మాజీమంత్రి వివేకా హత్య విషయంలో జగన్ విశ్వసనీయత ప్రజలకు తెలిసిపోయిందన్నారు.

చదవండి : రాష్ట్రాన్ని నలుగురు ‘రెడ్ల’కు రాసిచ్చారు..!!
వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారని.. అందరిపై బాదుడే బాదుడుతో మోయలేని భారం మోపుతున్నారని విమర్శించారు. జగన్ లాంటి నియంతలకు తాను భయపడనని అన్నారు. తెదేపా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వ దోపిడిని వివరించాలన్నారు. దొంగ లెక్కలు రాయటం.. దొరికిపోవటం జగన్ తీరని ఎద్దేవా చేసిన చంద్రబాబు.. అప్పులతో రాష్ట్ర పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు తెదేపా నుంచి వెళ్లినవాళ్లే ఉన్నారన్నారు. సీబీఐ కేసుల్లో తనతో ఉన్నవారితో పాటు, కేసులు వాదించిన వారికి జగన్ రాజ్యసభ సీట్లు ఆఫర్ చేశారని ఆక్షేపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరిని రాజ్యసభకు పంపుతున్నారని.. రాజ్యసభకు పంపేందుకు ఏపీలో సమర్థులు లేరా.. అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి