సీఎం కేసీఆర్ తో హీరో విజయ్ భేటీ.. కారణం అదేనంటూ..!! (వీడియో)

tamil-hero-vijay-meets-telangana-cm-kcr.jpg

తమిళ్ స్టార్ హీరో విజయ్, తెలంగాణ సీఎం కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో విజయ్ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, మంత్రి సంతోష్ కుమార్ కూడా ఉండడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇకపోతే విజయ్, కేసీఆర్ మీటింగ్ ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజుల నుంచి విజయ్ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్లు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా..? అని టాక్ నడుస్తోంది. మరోపక్క మినిస్టర్ రోజా భర్త సెల్వమణి తమిళ్ హీరోలను బయటికి వెళ్లి షూటింగ్స్ జరపకూడదని, దానివలన తమిళ్ ఇండస్ట్రీలో పనిచేసేవారు ఇబ్బందిపడతారని చెప్పుకొచ్చాడు. అయితే ఆయన మాటను లెక్కచేయకుండా విజయ్ తన నెక్స్ట్ సినిమా కోసం హైదరాబాద్ వచ్చాడు.

చదవండి : జగన్ దృష్టిలో నేను ఉన్నాను..!!

ఇక ఈ విషయం గురించి కూడా సీఎం తో చర్చించే ఉంటారని మరికొందరు అంటున్నారు. అయితే ఇందులో నిజాలు ఏంటి అనేవి తెలియదు కానీ.. ప్రస్తుతం విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే కొన్నిరోజుల నుంచి ఉంటున్నాడు. గతంలో మంత్రి మినిస్టర్ సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో విజయ్ పాల్గొన్న విషయం విదితమే. ఈ పరిచయం వలన హైదరాబాద్ లో ఉంటున్న విజయ్ ను సంతోష్ కుమార్, కేసీఆర్ ను కలిసేవిధంగా ఏర్పాటు చేసారని, అంతేతప్ప ఇందులో ఏ రాజకీయం లేదని విజయ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. మరి ఈ విషయమై విజయ్ కానీ, వంశీ పైడిపల్లి కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

  1. ముసలోడే కానీ.. మహానుభావుడు..!! (వీడియో)
  2. బిచ్చగాడి హీరోయిన్ ఉద్యోగం చేసుకుంటా అంటుంది..!!

Share this post

submit to reddit
scroll to top