చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద అవార్డు

ys-jagan-conferred-chief-minister-of-the-year-award-by-skoch-group.jpg

ఏపీ సీఎం వైఎస్ జగన్ దేశంలోనే బెస్ట్ సీఎంగా వరుసగా రెండోసారి నిలిచి అరుదైన ఘనత సాధించారు. గ్రామీణాభివృద్ధిలో స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా ‘చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద అవార్డు’ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎ౦పిక చేసి౦ది. విభజన అనంతరం రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ జాబితాలో రెండో బెస్ట్ సీఎంగా పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం మమత బెనర్జీ నిలిచారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది. ‘స్కోచ్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దక్కించుకుంది. అంతేకాదు.. సుపరిపాలనలోనూ ఏపీ టాప్‌లో నిలిచింది. సుపరిపాలన విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే టాప్-5లో ఉండగా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం ఈ ఘనతను అందుకోలేదు. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడో స్థానంలో ఒడిశా, నాలుగో స్థానంలో గుజరాత్‌, ఐదో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి.

చదవండి : జగన్ దృష్టిలో నేను ఉన్నాను..!!

స్కోచ్ సంస్థ ప్రతి ఏడాది దేశంలో ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలనా విధానాలు, తీసుకొస్తున్న కొత్త సంస్కరణలు, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు, పథకాలను చేరవేస్తోంది. ఈ అంశాలు గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ర్యాంకులో నిలిచేందుకు దోహదపడ్డాయి. ఈ అవార్డు రావడంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

  1. ముసలోడే కానీ.. మహానుభావుడు..!! (వీడియో)
  2. ముందస్తు ఎన్నికలకు సిద్దం – చంద్రబాబు..!!
  3. సీఎం జగన్ బాటలోనే దిల్ రాజు..!!

Share this post

submit to reddit
scroll to top