తమ సమస్యలు పరిష్కారం చేయాలని భారీ ప్రదర్శన!
వినతిపత్రాన్ని స్వీకరించిన కూసంపూడి!
ఫోటో రైటప్ 1:- పట్టణంలో ప్రదర్శన చేసిన అంగన్వాడీ అమ్మలు.
ఫోటో రైటప్ 2:- క్యాoపు కార్యాలయం ఎదుట ధర్నా.
ఫోటో రైటప్ 3:- మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ కు వినతి.
సత్తుపల్లి,సెప్టెంబర్,25,న్యూస్:- సీఐటీయూ,ఏఐటి యుసి ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల అపరిస్కృత సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరవధిక సమ్మె 15 వ రోజుకు చేరిన పట్టించుకున్న పాపాన పోవడంలేదని,చర్చలకు ప్రభుత్వం పిలవడం లేదని,బతికే జీఓ లు అడిగితే చచ్చే జీ ఓ లు ఇస్తూ మోసం చేస్తున్నారని
ఆగ్రహించిన అంగన్వాడీ అమ్మలు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య క్యాoపు కార్యాలయం వరకు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తు భారీ ప్రదర్శన నిర్వహించారు.ముందుగా కార్యాలయం ప్రధాన ద్వారం ఎదురుగా ఆందోళన నిర్వహించారు.అనంతరo కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే సండ్ర రావాలని తమ సమస్యల వినతి పత్రాన్ని తీసుకోవాలని నినదించగా స్థానిక మున్సి పల్ చైర్మన్ కూసంపూడి మహేష్ ధర్నా వద్దకు వచ్చి ఎమ్మెల్యే సండ్ర గ్రామాల పర్యటనలో వుండటం చేత
రావడం సాధ్యం కావడం లేదని నాకు వెళ్ళమని సమాచారం ఇచ్చారని తెలపగా సమస్యలతో కూడిన వినతపత్రాన్ని అందజేయగా మహేష్ స్పందిస్తూ సండ్రకు అందజేస్తామని తెలిపారు.అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్
అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొన్న సీఐటీయూ,సీపీఎం,ఐద్వా నేతలు కొలికపోగు సర్వేశ్వరరావు,మోరంపూడి పాండురంగారావు,అర్వపల్లి జగన్మోహన్ రావు,రావుల రాజబాబు,పాకలపాటి ఝాన్సీ,మోరం పూడి వెంకటేశ్వరరావు లు మాట్లాడుతూ ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో:- ఉదయశ్రీ,జీవమ్మ,నాగేంద్ర,రామేశ్వరి,పద్మ,కళావతి,
నాగలక్ష్మి,పార్వతి,సత్యావతి,షకీనా,పుష్పకుమారి,విజయలక్ష్మి,జయమ్మ లతో పాటు మరో 200 మంది పాల్గొన్నారు.