కాంగ్రెస్ పార్టీ అంటేనే హత్య రాజకీయాలు

fc320e12-1a03-44d8-9f42-4438733e831a.jpg

కాంగ్రెస్ పార్టీ అంటేనే హత్య రాజకీయాలు

దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి పై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం

కాంగ్రెస్ పార్టీ అంటేనే హత్య రాజకీయాలకు పెట్టింది పేరుగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరిస్తుందని సత్తుపల్లి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహించారు. దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పైన జరిగిన దాడి ఇందుకు నిదర్శనమని టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. ఈ దాడిన తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం సాయంత్రం సత్తుపల్లి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యాలయం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నాయకుల మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం హత్య రాజకీయాలు, హైదరాబాదులో మత ఘర్షణలు కు పెట్టింది పేరుగా అభివర్ణించారు .14 సంవత్సరాల నుంచి తమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని శాంతియుతంగా సాధించి శాంతి పరిపాలన చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ గూండాలు అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు‌. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో సౌమ్యుడైన తమ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి పై దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ గుండాయిజానికి ధర్పం పడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే తరహాలో రాజకీయాలు చేసి ఉంటే ఈ రోజు కాంగ్రెస్ నాయకులు మిగిలేవారు కాదని చెప్పారు. ఇప్పటికైనా హత్య రాజకీయాలు ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ కనుసనల్లో జరిగే ఎన్నికలను ప్రశాంతంగా జరగనివ్వకపోతే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కోసంపూడి మహేష్ డిసిసిబి డైరెక్టర్ సంజీవరెడ్డి చల్లగొల్ల కృష్ణయ్య సత్తుపల్లి పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు రఫీ మల్లూరు అంకమరాజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు నరుకుల్ల శ్రీను నడ్డి ఆనందరావు నరసింహారెడ్డి రాఘవేంద్ర రాము అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు

Share this post

submit to reddit
scroll to top