ఎమ్మెల్యే సండ్రను ప్రశంసలతో ముంచెత్తిన సీఎం కెసిఆర్
బుధవారం సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు లో జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రశంసలతో సీఎం కేసీఆర్ ముంచి ఎత్తారు. సండ్ర వెంకట వీరయ్య నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని 108 100 లాంటి అంబులెన్సులు ఆలస్యంగా వస్తాయేమో కానీ సండ్ర వెంకట వీరయ్య కు ఒక్క ఫోన్ కాల్ చేస్తే నిత్యం నియోజకవర్గ ప్రజల వద్దకు పక్షిల వాలతారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. అదేవిధంగా ఏ పని కావాలన్నా సండ్ర పట్టుబడిన విక్రమార్కుడిలా తన చుట్టూ తిరిగి పనులు సాధించటంలో దిటా అన్నారు. తన నియోజకవర్గానికి కావలసిన అన్ని పనులు చేయించుకునే వారిలో నాకు ఆప్తుడైన ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య ఒకరిని చెప్పారు. సండ్ర వెంకట వీరయ్య వచ్చిన తర్వాతే సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని అభినందించారు. ఇలాంటి ఎమ్మెల్యేను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పారు. పనిచేసే వారికి ఎప్పుడు ఆదరించాల్సిన బాధ్యత మీటింగ్ కు వచ్చిన ప్రతి ఒక్కరు ఉందని అన్నారు మేము మాట్లాడిన మాటలు మీ గ్రామాల్లో ఓటర్లకు వివరించాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకోవాలని కార్యకర్తలను సీఎం కోరారు. ఇ సభకు వచ్చిన ప్రజానీకాన్ని చూస్తుంటే సండ్ర వెంకట్ వీరయ్య డెబ్బైవేల ఓట్ల మెజారిటీతో గెలవడం తధ్యమని సీఎం అన్నారు.