చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లండి
సండ్ర వెంకట వీరయ్యను భారీ మెజారిటీతో గెలిపించండి
సండ్ర నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఖమ్మం ఎంపీ నామ
సత్తుపల్లి నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పనిలోకి దిగుతున్న సండ్ర వెంకట వీరయ్య ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు గురువారం సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సండ్ర వెంకట వీరయ్య నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి,వద్దిరాజు రవిచంద్రలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో నిద్రాహారాలు మారి సండ్ర గెలుపు కోసం ఏ రకంగా అయితే కృషి చేశారో ప్రతి ఒక్క కార్యకర్త ఈసారి కూడా సండ్ర భారీ మెజారిటీతో గెలుపొందినందుకు కృషి చేయాలన్నారు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ 20 రోజులపాటు శ్రమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు తొలితా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నామినేషన్ పత్రాలతో జవహర్ నగర్ లో ఉన్న చర్చిలో అయ్యగారిపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో సత్తుపల్లి జమీ మసీదులో హనుమాన్ నగర్ లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు ప్రార్థనలు నిర్వహించిన అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ సెంటర్ వెంకట వీరయ్య భారీ మెజారిటీతో గెలవడం సజ్జమని తద్వారా ఈసారి ఏర్పడే టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా మీ ముందుకు వస్తారని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ సత్తుపల్లి నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు ఎదుట మంజూరు చేసి అభివృద్ధి పరిచారని చెప్పారు. కార్పొరేట్ కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయంలో పార్టీ కోసం కష్టపడి పక్కన పెట్టి డబ్బు కోసం టికెట్లు అమ్ముకోవడం ద్వారా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ లాంటివారు టిఆర్ఎస్ పార్టీ వైపు పయనించారని గత ఎన్నికల్లో సెంటర్ తో పాటు పని చేసిన సంభాని చంద్రశేఖర్ సండ్ర గెలుపు కోసం కృషి చేయనున్నారని వద్దిరాజు చెప్పారు
సండ్ర కోసం కష్టపడదాం
రాజ్యసభ సభ్యులు బండి పార్థసార రెడ్డి
కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి ప్రాంతంలో చేసిన అభివృద్ధి తనను ఆకట్టుకుంది రాబోయే ఎన్నికల్లో మీరు నేను అందరం కలిసి సండ్ర గెలుపు కోసం పని చేద్దాం సెంటర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవడం ద్వారా ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా మంచి పదవి లభిస్తుందని బండి చెప్పారు ముఖ్యమంత్రి మదిలో సండ్ర వెంకట వీరయ్య కు ప్రత్యేక స్థానం ఉందని అందుకోసమే తనను సత్తుపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించారని అన్నారు తనకు అప్పజెప్పిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసి సండ్రను గెలిపించి కేసిఆర్ కు కానుకగా ఇస్తానని అందుకు మీ అందరి కృషి సహకారం కావాలని బండి పాలసాద్ రెడ్డి కోరారు
భారీ మెజారిటీతో గెలుస్తాం సత్తుపల్లి జిల్లాను ఏర్పాటు చేసుకుందాం
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
గత మూడుసార్లు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి ఆశీర్వదించాలని వారి నమ్మకానికి అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని సండ్ర చెప్పారు కొన్ని దుష్ట పార్టీలు తప్పుడు ప్రచారాలతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని వాటిని టిఆర్ఎస్ కార్యకర్తలు తిప్పి కొట్టాలన్నారు తాను గెలిచిన నాటి నుంచి ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగిందన్నారు తాను నాన్ లోకల్ గా ప్రచారం చేస్తున్న కొందరికి ఇప్పటివరకు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు తనను గెలిపించడం ద్వారా సత్తుపల్లి ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లాగా ఏర్పాటు చేసుకుందామని సండ్ర చెప్పారు. కార్యకర్తల సమావేశం అనంతరం భారీ ర్యాలీతో సెంటర్ వెంకట వీరయ్య నామినేషన్ను దాఖలు చేశారు.