సత్తుపల్లి :
రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి అనేక దశాబ్దాలుగా తీవ్ర అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని మాదిగలు
ఒడించాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండారు వీరబాబు విమర్శించారు. సత్తుపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య కు మద్దతుగా అంబేద్కర్ యువజన సంఘం, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ, ఎమ్మార్పీఎస్, టి ఎమ్మార్పీఎస్ తదితర సంఘాలు గురువారం సత్తుపల్లిలో సండ్రకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. సమావేశంలో డాక్టర్ బండారి గారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం దాకా సామాజిక న్యాయం కోసం మాదిగలు మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారని తెలిపారు. మాదిగలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి దోహదం చేసే అవకాశాలను కల్పించడంలో గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాస్తూ కాంగ్రెస్ పార్టీ మాదిగలను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లోనూ
కాంగ్రెస్ పార్టీ మాలలకు కేటాయించటాన్ని మాదిగలు అర్థం చేసుకోవాలన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర వెంకట వీరయ్య ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు గొల్లమందల శ్రీనివాసరావు, కనకపుడి సతీష్, పండు, మహేష్, పవన్, కళ్యాణ్, నగేష్, సతీష్, గడ్డం పండు, అనిల్, ప్రకాష్, గడ్డం ప్రభాకర్, వేణు తదితరులు పాల్గొన్నారు.