ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ పేర్లు విడుదల కావటంతో…సిని నటుడు ఆలీ స్పందించారు. ఎంతో కాలంగా సీఎం జగన్ కు సన్నిహితంగా ఉంటున్న ఆలీకి త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతారని..అది కూడా పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన వస్తుందంటూ కొద్ది నెలల క్రితం సీఎంను ఆలీ కలిసిన సమయంలో చెప్పుకొచ్చారు. అయితే, ప్రచారం సాగిన విధంగా ఆలీకి రాజ్యసభ దక్కలేదు. దీని పైన స్పందించిన ఆలీ
జగన్ దృష్టిలో తాను ఉన్నానని చెప్పారు. భవిష్యత్‌లో ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తానని వెల్లడించా. ఫలానా పదవి ఇస్తామని జగన్ ఎప్పుడూ హామీ ఇవ్వలేదని చెప్పారు.

చదవండి : ముసలోడే కానీ.. మహానుభావుడు..!! (వీడియో)
ఏదో ఒక పదవి ఇస్తామని గట్టిగా చెప్పారని గుర్తు చేసారు. తాను ఆ నమ్మకంతోనే ఉన్నానని చెప్పారు. అందరూ అనుకుంటున్నట్లు వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కూడా తనకు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికే ఆ పదవి వేరే వాళ్ళకు కేటాయించారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి ఒకరోజు పిలుపు వస్తుందిని.. ఆరోజు మీడియా ముందుకు వస్తానని అలీ ప్రకటించారు. తాను రాజ్యసభ సీటును ఆశించలేదని వెల్లడించారు. ఆలీని వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దింపుతారనే ప్రచారమూ సాగుతోంది. అయితే, ఇప్పటి వరకు ఆలీకి దక్కబోయే పదవి ఏంటనేది స్పష్టత రాలేదు.
ఇవికూడా చదవండి