ఎట్టకేలకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఆయన సర్వీసు పునరుద్ధరణ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాల రోజు నుంచి జీఏడిలో రిపోర్టు సమయం వరకు వెయిటింగ్ పిరియడ్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 22న రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఏబీ వెంకటేశ్వరరావును మళ్లీ సర్వీసుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాాల్పడ్డారనే ఆరోపణలతో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది.

చదవండి : ముసలోడే కానీ.. మహానుభావుడు..!! (వీడియో)
అఖిల భారత సర్వీసు ఉద్యోగుల రూల్స్ ప్రకారంగా సస్పెన్షన్ రెండేళ్లకు మించి ఉండకూడదని ఏబీ వెంకటేశ్వరరావు తరపున న్యాయవాది వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది., సస్పెన్షన్ రెండేళ్లు ముగిసనందున ఇకపై సస్పెన్షన్ అమల్లో ఉండని సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. అయితే ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలను ఉల్లంఘించారని జగన్ సర్కార్ ఆయనపై కేసు నమోదు చేసింది. అంతేకాదు ఆయనను సస్పెండ్ చేసింది. ఇక, న్యాయ పోరాటం ద్వారా ఇప్పుడు ఏబీ వేంకటేశ్వర రావు తిరిగి సర్వీసులోకి వస్తున్నారు.
ఇవికూడా చదవండి