బీఆర్ఎస్, కాంగ్రేస్..
రెండూ ఒక తాను ముక్కలే..
సత్తుపల్లి జిల్లా బీజేపీతోనే సాధ్యం..
దోచుకోవటం పనిగా బీఆర్ఎస్,కాంగ్రెస్ పాలన..
పేదోడి కష్టం తీర్చిన ఆనవాళ్లు ఈ రెండు పార్టీల్లో లేవు..
ప్రధాని మోడీతోనే దేశంలో సంక్షేమ పాలన..
విలేఖర్ల సమావేశంలో బీజేపీ అభ్యర్థి నంబూరి..
సత్తుపల్లి
బీఆర్ఎస్, కాంగ్రేస్ రెండూ ఒక తాను ముక్కలేనని బీజేపి, జనసేన కూటమి అభ్యర్థి నంబూరి రామలింగేశ్వర ఆరోపించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ పాలన పక్కన పెట్టి వ్యాపారమే ధ్యేయంగా లాభాపేక్ష కోసం పనిచేస్తున్న ఈ రెండు పార్టీలను ఘోరంగా ఓడించాలని పిలుపు ఇచ్చారు. దేశంలో సంక్షేమ పాలన ప్రధాని మోడీతోనే సాధ్యపడుతుందన్నారు. ఈ పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలను కొని అధికారంలోకి రావాలని చూస్తే అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రజలు డబ్బుకు అమ్ముడు పోతే మరో ఐదు సంవత్సరాలు కష్టాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సాగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ర్యాలీలో పరిశీలిస్తే విచిత్రమైన సంఘటనలు కనిపించాయన్నారు, టిడిపి జెండాలు రెండు ర్యాలీల్లో ఉన్నాయన్నారు. ఆ జెండా ఉపయోగించుకునే రైటు ఒక్క జనసేనకే ఉందన్నారు. సత్తుపల్లి జిల్లా ఏర్పాటు బిజెపితోనే సాధ్యపడుతుందని, ఆ దిశగా ప్రజలు ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామన్నారు, భార్యా,భర్తలకు రెండు పెన్షన్లు ఇస్తామన్నారు, ఉచితంగా వైద్యం, విద్య అందిస్తామన్నారు. నిబద్ధతతో పని చేస్తామన్నారు. సింగరేణి సంస్థ గ్రీన్ ట్రిబ్యునల్ లో డిపాజిట్ చేసిన రూ. 42 కోట్లు తెచ్చి దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టిస్తామన్నారు. సీనియార్టీతో పని లేకుండా ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలం, ఇల్లు ఇప్పిస్తామన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి గ్యాస్ ఉచితంగా ఇస్తామన్నారు. మరుగుదొడ్లు కట్టిస్తామన్నారు, నిధుల కష్టాల్లో ఉన్న సర్పంచులను ఆదుకుంటామన్నారు. వైకుంఠ దామం లేని గ్రామంలో కట్టిస్తామన్నారు. బిజెపి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్చార్జి బండి నరేష్, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి భాస్కర్ని వీరంరాజు, బిజెపి,జనసేన నాయకులు. నాయుడు రాఘవరావు,పాలకొల్లు శ్రీనివాసరావు, ఆచంట నాగ స్వామి, మట్టా ప్రసాద్, అప్పారావు, సాయి చందు, జబ్బార్, రవివర్మ, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.