రైతు పక్షపాతి కేసీఆర్ కి ధన్యవాదాలు.

1.jpg

సత్తుపల్లి లో 125 మంది రైతులకు రుణమాఫీ.
ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ సత్తుపల్లి సొసైటీ చైర్మన్ చల్లగుల్ల కృష్ణయ్య.

సత్తుపల్లి సహకార బ్యాంకు పరిధిలోని 125 మంది రైతులకు రూ:67,70,000 రైతు రుణమాఫీ అయినదని , 70 మంది రైతులకు రూ:35,40,000 తిరిగి రుణమాఫీ అయిన రైతుల ఖాతాలోకి పైకాన్ని జమ చేశామని ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ , సత్తుపల్లి సొసైటీ చైర్మన్ చల్లగుళ్ల కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సత్తుపల్లి సొసైటీ 2012, 2022 లలో జిల్లాలోని ఉత్తమ సొసైటీగా ఎన్నిక కాబడిందని ఇందుకు సహకరించిన సత్తుపల్లి రైతులకు అభినందనలు తెలిపారు. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న రైతుల కష్టసుఖాలను తెలుసుకుంటూ రైతులకు వెన్ను దున్నుగా ఉంటున్న రుణ మాఫీ చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య కి సొసైటీ చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు కర్నాటి వెంకటనారాయణ రెడ్డి, బొంతు శ్రీనివాసరావు, కోట సత్యనారాయణ, చింతకుంట్ల వెంకటాచారి రైతులు పాల్గొన్నారు.

Share this post

submit to reddit
scroll to top