బిచ్చగాడి హీరోయిన్ ఉద్యోగం చేసుకుంటా అంటుంది..!!

ali-reaction-on-rajyasabha-candidates-finalisation.jpg

రోషగాడు సినిమాలో పోలీస్ యాక్టింగ్ తో యూత్ హృదయాలను దోచుకున్న నివేదా పేతురాజ్. తర్వాత బ్రోచేవారెవరురా, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురము’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ‘పాగల్‌’ వంటి తదితర మూవీస్‌లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే క్రేజ్‌ సంపాదించుకుంది. ఇటీవల ‘బ్లడీ మేరీ’ చిత్రంతోనూ ఆకట్టుకుంది. నివేదాకు పర్ఫార్మెన్స్‌ పరంగా మంచి మార్కులే పడ్డాయి. అయితే స్టార్‌ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

హీరోయిన్‌ కన్నా నటిగా అనిపించుకోవడం గర్వంగా ఉంటుంది. కథానాయికగా సినిమాలు చేయకపోతే కెరీర్‌ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. నాకు అలాంటి భయం లేదు. నేను ఎలాంటి బౌండరీస్‌ పెట్టుకోలేదు. నటనకు ఇంపార్టెన్స్‌ ఉంటే ఎలాంటి రోల్స్‌ అయినా చేస్తాను. ఒకవేళ సినిమా ఆఫర్లు రాకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటా. అని తెలిపింది నివేదా పేతురాజ్‌. ఆమె నటించిన ‘విరాట పర్వం’ సినిమా జూలై 1న విడుదల కానుంది.

Share this post

submit to reddit
scroll to top