ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని పలు గ్రామాల్లో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క కల్వకుంట్ల కుటుంభం లబ్ది పొందిందన్నారు.రెండు సార్లు తెలంగాణా ప్రజలకు మాయమాటలు చెప్పి వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు.మాటలు తప్ప కేసీఆర్ దగ్గర చేతలు లేవన్నారు.మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన కేంద్ర ప్రభుత్వం డ్యాములు కట్టిన అధికారులను కనీసం ప్రశ్నించలేదని ఆయన విమర్శించారు.ధనిక రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల ఆప్పుల్లోకి కేసీఆర్ తీసుకుపోయాడని ఆయనధ్వజమెత్తారు. ఇందిరమ్మ పాలన కావాలా దోపిడీ దొంగల పాలన కావాలా ప్రజలు ఆలోచించుకోవాలని ఇందిరమ్మ రాజ్యం కావాలంటే ప్రజలు హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు..
బీ.ఆర్.ఎస్ బీజేపీ లది పెవికాల్ బంధం పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
